ఈ మకర సంక్రాంతి పండుగ సందర్బమున లయోఫ్లోరల్స్ సంస్థ ద్వార, మా యొక్క కస్టమర్స్ మరియు శ్రేయోబిలాషులు అందిరికి శుభాకాంక్షలు తెలియజేయుచున్నాము.
సూర్యుడు మకర రాసి నందు ప్రవేశించిన రోజు మకర సంక్రాంతి. ఈ రోజు పాతదానిని విడిచి కొత్తకు స్వాగతించు రోజు. భోగి నాడు ఇంటిలో ఉన్న పాతవస్తువులను కాల్చి సంక్రాంతి రోజున కొత్త బట్టలతో, ఇంటిని సుబ్రపరిచి, ముగ్గులు వేసి, గొబ్బెమ్మలతో పూలతో అలంకరించి, ఆడపిల్లల పాటలు, కోలాటం ఆటలమద్య, గాలిపటాల సందడిలో, బంధువుల, స్నేహితుల మద్య గడిపే మధురమైన రోజు ఈ సంక్రాంతి.
పల్లెనాట హరిదాసులు, గంగిరెద్దులు, కోళ్ళపందాలు, వీధి నాటకాలు, పాడిపంటల మధ్య ఆనందముగా గడిపేరోజే సంక్రాంతి.
సంక్రాంతి పండుగ మూడు రోజులు జరుపుకుంటారు. మొదటి రోజు భోగి ఆ రోజు పాత వస్తువులను కాల్చేసి, ఇంటిని సుబ్రపరిచి, ఇంటిలోనికి కొత్త వస్తువులకు ఆహ్వానము పలుకుతాము.
రెండవ రోజు సంక్రాంతి ఈ రోజు కొత్త పంటను ఇంటికీ తీసుకునివస్తారు, కొత్త వస్తువులు, కొత్త బట్టలు, ఆటలు పాటలతో ఇంటిల్లిపాది పండుగ జరుపు కుంటారు.
మూడవ రోజు కనుమ, ఈ రోజు పాడి జంతువులను అలంకరించి పూజిస్తారు. తెలుగు వారు ఊరు వాడ ఏకమై చేసుకునే పండుగే సంక్రాంతి.
సంక్రాంతి రోజే విష్ణు మూర్తి మహాబలిని పాతాళానికి తోక్కిన రోజు, గోదాదేవి పెరుమాళ్ (వెంకటేశ్వర స్వామి) లో ఐక్యమైన రోజు. శ్రీ కృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తిన రోజు.
లయోఫ్లోరల్స్ సంస్థ పూలను ఎన్నో సంవత్సరాలు సంరక్షించేందుకు Lyophilization అనే పద్దతి ని కనుగొనింది. ఈ పద్దతి ద్వారా పూలను 20 సంవత్సరముల వరకు వాడిపోకుండా preserve / సంరక్షించవచ్చు.
సంక్రాంతి పండుగ ఆనందాలను జ్ఞాపకాలను ఎన్నో సంవత్సరాలు మీరు గుర్తు పెట్టు కోవాలంటే నేడే విచ్చేయండి మా website http://lyoflorals.com/ మరియు
Follow us on our social media to check out the latest designs.
Facebook
Google
Twitter
Pinterest
Lyoflorals సంస్థను Dr.Mahalakshmi V.Reddy గారు forever memories (జీవితకాల జ్ఞాపకాలు) అనే నినాదముతో స్థాపించారు. “Happy times come and go but the memories stay forever”. సంతోష సమయాలు వస్తాయి పోతాయి కానీ ఆ స్మృతులు మాత్రమూ మదిలో నిలిచి పోతాయి. సీతమ్మవారు చూడామణిని చూస్తూ రాముని స్మృతులతో అశోకవనములో సంవత్సరము కాలము గడిపారు. అదేవిదముగా ఈ సంక్రాంతి మదుర స్మృతులను Lyoflorals ఎన్నటికి వాడిపోని పువ్వుల కానుకలతో మీ బంధుమిత్రులను ఆనందపరచండి